ఖానాపూర్: చర్మ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: చర్మ వ్యాధుల నిపుణులు ప్రొఫెసర్ డాక్టర్ గాయత్రి
స్వస్థ్ నారి సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా గురువారం కడెం ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ శివకుమార్ ఆధ్వర్యంలో చర్మవ్యాధుల ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్బంగా చర్మ వ్యాధుల నిపుణులు ప్రొఫెసర్ డాక్టర్ గాయత్రి మండలంలో వివిధ చర్మ వ్యాధులతో బాధపడుతున్న వారికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. చర్మ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని చర్మానికి ఎలాంటి వ్యాధులు సోకినట్టు అనిపించిన వెంటనే మండల ప్రభుత్వాసుపత్రిలో సంప్రదించి మందులు వాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో CHO చంద్రశేఖర్, సూపర్వైజర్ నిర్మల, వైద్య సిబ్బంది సృజన,నరసయ్య తదితరులు పాల్గొన్నారు.