కుప్పం: పిఈఎస్ ఆసుపత్రిలో సంజీవిని ఆధార్ సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్
కుప్పం పిఈఎస్ ఆసుపత్రిలో సంజీవిని ఆధార్ సెంటర్, చిన్నపిల్లల మానసిక ఎదుగుదల కేంద్రాన్ని ఎమ్మెల్సీ శ్రీకాంత్, కడ పీడి వికాస్ మర్మత్, పిఈఎస్ ఛైర్మన్ డా. జవహర్ దొరస్వామి ప్రారంభించారు. PES లో ఆధార్ కేంద్రంతో పాటు చిన్నపిల్లల మానసిక ఎదుగుదల కేంద్రాన్ని ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని, పేద ప్రజలకు PES ఆసుపత్రిలో మరింత మెరుగైన సేవలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తామని పిఈఎస్ ఛైర్మన్ డా. జవహర్ దొరస్వామి తెలిపారు.