షబ్బీ మేరాజ్ సందర్భంగా ముస్లిం రాత్రి పూట భక్తి శ్రద్ధలతో నమాజ్ చేసుకోవాలని ఎటువంటి దుశ్చర్యలకు పాల్పడకుండా జాగ్రత్తలు పాటించాలని రాయదుర్గం అర్బన్ సిఐ జయనాయక్ సూచించారు. శుక్రవారం రాత్రి మతపెద్దలకు పలు సూచించారు చేశారు. ముఖ్యంగా పిల్లల్ని రోడ్లపైన వచ్చి అరుపులు కేకులు వేయకుండా నివారించాలన్నారు. మజీద్ ప్రాంగణంలోనే ప్రార్థనలు చేసుకోవాలని కేరారు. బళ్లారి రోడ్ లోని జామియా చౌక్ మజీద్, దర్గా మజీద్, కోటలో టిప్పు సుల్తాన్ మజీద్ ఆవరణలోనే ప్రార్థనలు జరుపుకోవాలని తెలియజేశారు. కొంతకాలంగా దొంగతనాలు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఎవరైనా కొత్త వాళ్ళు కనిపిస్తే వెంటనే పోలీసులకు తెలిపాలన్నారు.