నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పన ధ్యేయంగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే ఆదిమూలం తెలిపారు
పిచ్చాటూరు: జాబ్ మేళాకు స్పందన పిచ్చాటూరులోని ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో శనివారం జాబ్ మేళా కార్యక్రమం జరిగింది. 17 కంపెనీల ప్రతినిధులు పాల్గొని నిరుద్యోగ యువతీ యువకులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఉద్యోగానికి ఎంపికైన వారికి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, స్కిల్ డెవలప్మెంట్ అధికారులు ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పనే ధ్యేయంగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.