ధర్మపురి: మంత్రి కార్యాలయం ఎదుట అంగన్వాడిల నిరసన.
ఫోన్ లో మాట్లాడిన మంత్రి అడ్లూరి..
సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని హామీ..
జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట అంగన్వాడి కార్యకర్తలు నిరసనకు దిగారు. ఎన్నికలకు ముందు తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ క్యాంపు కార్యాలయం ఎదుట బైటాయించి ఆందోళన చేపట్టారు. సుమారు అరగంట పాటు తమ నిరసనను తెలపడంతో, స్పందించిన మంత్రి అడ్లూరి అంగన్వాడి కార్యకర్తలతో ఫోన్ లో మాట్లాడారు. అంగన్వాడిల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి, పరిష్కారం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో తమ ఆందోళన విరమించారు. ఈ సందర్బంగా పలువురు అంగన్వాడి కార్యకర్తలు మాట్లాడుతూ.