విజయనగరం: మెంటాడ మండలం కుంఠినవలసలో డిప్యూటీ డీఈఓ ఎదుటే తాగిన మైకంలో హైస్కూల్ హెచ్ఎం చిందులు
మెంటాడ మండలం కుంఠినవలస హై స్కూల్ హెచ్ఎం తాగినమైకంలో చిందులేశారు. నిత్యం మద్యం సేవించి పాఠశాలకు వస్తున్నారని స్కూల్ ఛైర్మన్ సత్యనారాయణ, డిప్యూటీ డీఈవో మోహనరావుకు ఫిర్యాదు చేశారు. దీంతో గురువారం కుంఠినవలస పాఠశాల్లో విచారణ జరుపుతుండగా హెచ్ఎం అసభ్యపదజాలంతో మాట్లాడారు. ఇక్కడ జరిగిన సంఘటనపై ఉన్నతాధికారులకు నివేధిస్తానని డిప్యూటీ డీఈవో మోహనరావు అన్నారు.