శ్రీకాకుళం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ ప్రైవేటీకరణ ఆపాలి: సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు అమ్మన్నాయుడు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్ ప్రైవేటీ కరణ ఆపాలని, విద్యుత్ స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు సి.హేచ్ అమ్మన్నాయుడు డిమాండ్ చేశారు. చండీఘర్ లో విద్యుత్ ప్రైవేటీ కరణకు వ్యతిరేకంగా సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా అమ్మన్నాయుడు మాట్లాడుతూ విద్యుత్ ప్రైవేటీ కరణ చేసి ప్రజలపై అధిక బారాలే వేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నించడం తగధని అన్నారు.