సాంకేతికతను అందిపుచ్చుకుని క్షేత్రస్థాయిలో రైతుల వద్దకు తీసుకెళ్లాలి : జిల్లా కలెక్టర్ ఆనంద్
Anantapur Urban, Anantapur | Nov 20, 2025
వ్యవసాయ అనుబంధ రంగాలలో పథకాలు, కార్యక్రమాలను ఎలా అమలుచేయాలనే విషయమై సాంకేతికతను అందిపుచ్చుకుని క్షేత్రస్థాయిలో రైతుల వద్దకు తీసుకెళ్లాలని, ఆయా శాఖల అధికారులు పూర్తి సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ఆదేశించారు. గురువారం సాయంత్రం ఐదు గంటల సమయంలో అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో వ్యవసాయ, అనుబంధ రంగాల అధికారులతో మరియు రైతు ఉత్పత్తిదారుల సంఘం ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆయా శాఖల అధికారులు వ్యక్తిగతంగా ఆవిష్కరణలు తీసుకువచ్చేలా పనిచేయాలన్నారు.