ప్రజా సమస్యల పరిష్కార వేదిక" లో అందిన అర్జీలకు సత్వర పరిష్కారాన్ని చూపాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్ రాజాబాబు,
Ongole Urban, Prakasam | Jan 19, 2026
ప్రజా సమస్యల పరిష్కార వేదిక" లో అందిన అర్జీలకు సత్వర పరిష్కారాన్ని చూపాలని జిల్లా కలెక్టర్ రాజాబాబు, అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. ఒంగోలు కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ హాల్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం, పిజిఆర్ఎస్), రెవెన్యూ క్లినిక్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీ రాజాబాబు, జాయింట్ కలెక్టర్ శ్రీ ఆర్ గోపాల క్రిష్ణ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు శ్రీ శ్రీధర్ రెడ్డి, శ్రీ జాన్సన్, శ్రీమతి కళావతి లతో కలసి పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వచ్చిన అర్జీలను ఆయా శాఖల అధికారులకు పంపించారు.