అసిఫాబాద్: ఈ నెల 15వ తేదీన ప్రత్యేక లోక్ అదాలత్ :జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం.వి. రమేష్
రాజీమార్గాన సమస్యలు పరిష్కరించేందుకు ఈ నెల 15వ తేదీన జిల్లా కేంద్రంలోని న్యాయస్థాన భవన సముదాయంలో ప్రత్యేక లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎం.వి. రమేష్ గురువారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. క్రిమినల్ కాంపౌండబుల్, ఎన్ ఐ యాక్ట్, కుటుంబ కలహాలు , వాహన ప్రమాదాలు, సివిల్, బ్యాంకు రికవరీ ఇతర కేసులకు సంబంధించి రాజీమార్గాన సమస్యలు పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు.