రాజంపేట: ఆరుగొండ గ్రామానికి చెందిన సతీష్ అనే యువకుడు తిరుపతిలో అనుమానాస్పద స్థితిలో మృతి
కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆరుగొండ గ్రామానికి చెందిన సతీష్ అని వ్యక్తి రెండు రోజుల క్రితం తిరుపతిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తిరుపతి రిలయన్స్ రైల్వే బ్రిడ్జి కింద రక్తస్రావమై చనిపోయినట్లు రైల్వే పోలీసులకు సమాచారం అందింది. మృతుని వద్ద లభించిన ఆధారాల ప్రకారం బుధవారం అతనిని రాజంపేట మండలం ఆరుగొండ గ్రామానికి చెందిన సతీష్ గా గుర్తించారు గొంతు కోసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తూ కేసును నమోదు చేసుకుని దర్యాప్తును చేపట్టారు.