అసిఫాబాద్: రైస్ మిల్లులపై విజిలెన్స్ అధికారుల దాడులు, రూ.8కోట్ల ధాన్యం పక్కదారి
సిర్పూర్ నియోజకవర్గంలో గల రైస్ మిల్లులపై స్టేట్ టాస్క్ ఫోర్స్,విజిలెన్స్,సివిల్ సప్లై అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రూ.8 కోట్ల విలువగల ధాన్యం పక్కదారి పట్టినట్లు గుర్తించారు. సిర్పూర్ లోని శ్రీ బాలాజీ రైస్ మిల్ నందు నాలుగున్నర కోట్ల ధాన్యం, కౌటాలలోని వెంకటేశ్వర రైస్ మిల్ లో మూడున్నర కోట్ల విలువగల ధాన్యం పక్కదారి పట్టినట్లు గుర్తించామన్నారు.