శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలో శనివారం సాయంత్రం ఒక్కసారిగా వర్షం మొదలైంది. రెండు రోజులుగా వాతావరణం చల్లగా ఉంటోంది. ఇవాళ పగలంతా తుంపర చినుకులు పడ్డాయి. చిరు వ్యాపారులు వర్షం వల్ల కొంత వరకు ఇబ్బందులు పడ్డారు. అల్పపీడన ప్రభావం వల్ల వర్షం కురుస్తోంది. చెరువులు, కుంటలు నిండే విధంగా వర్షం కురిస్తే బాగుంటుందని ప్రజలు చర్చించుకుంటున్నారు.