అనంతపురం నగరంలోని దివ్యశ్రీ ఆసుపత్రి సమీపంలో మృతి చెందిన వ్యక్తి నగరంలోని మూడవ క్రాస్‌కు చెందిన వెంకటేష్ గా గుర్తించినట్లు టూ టౌన్ పోలీసులు వెల్లడించారు. అనంతపురం పోలీస్ ఆఫీస్ గోడకు ఆనుకొని ఆదివారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటనకు సంబంధించి పోలీసులు మృతుడు వెంకటేష్ గా గుర్తించామని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని మార్చురీకి తరలించినట్లు వెల్లడించారు.