సూళ్లూరుపేటలో 26 పాఠశాలలకి Kabaddi and Volleyball Sports కిట్స్ అందజేసిన Magic Bus సంస్థ
బాలల దినోత్సవం సందర్భంగా మోండెలీజ్ కంపెనీ సహకారంతో, మేజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అమలు జరుగుతున్న స్పోర్ట్స్ ఫర్ ఎక్సలెన్స్ కార్యక్రమం భాగంగా మొత్తం 26 పాఠశాలలకు శుక్రవారం క్రీడా సామాగ్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కబడ్డీ, వాలీబాల్ క్రీడల అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకొని కిట్ల రూపంలో అందజేశారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పరిధిలోని కోటపోలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో మేజిక్ బస్ క్లస్టర్ మేనేజర్ అనంద్, పీసీ సుమంత్, కోచ్ సందీప్ పాల్గొన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం. చంద్రమౌళి, వ్యాయామ ఉపాధ్యాయులు ఎస్. భాస్కర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు క్రీడా క