ఖమ్మం అర్బన్: ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని మంగళవారం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అకస్మికంగా తనిఖీ చేశారు. ప్రధాన ఆస్పత్రిలోని క్యాజువాలిటి, వెయిటింగ్ హాల్, ల్యాబ్, డయాగ్నొస్టిక్ సెంటర్,ఎంపిహెచ్ డబ్ల్యు. ట్రైనింగ్ సెంటర్,ఎంసిహెచ్,ఓపి,ఇన్ పెషెంట్ వార్డు, అవుట్ పేషేంట్ వార్డు,గుండె సంబంధిత సెంటర్, కళ్ల చిక్సిత కేంద్రం,గర్భిణీ స్త్రీల వార్డ్, మైత్రి ట్రాన్స్ క్లినిక్,మందులు, సరుకులు నిల్వ చేసే స్టోర్ రూమ్ లను కలెక్టర్ పరిశీలించారు.సిబ్బంది వివరాలు,మందులు,ప్రజలకు అందిస్తున్న సేవల గురించి ఆరా తీశారు.వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ అందుబాటులో ఉంటూ, మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు