కర్నూలు నగర ప్రజలందరూ సహకరిస్తేనే ‘క్లీన్ అండ్ గ్రీన్ సిటీ’ సాధ్యమవుతుందని నగరపాలక కమిషనర్ పి.విశ్వనాథ్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అపరిశుభ్రంగా ఉన్న ఖాళీ స్థలాలను స్వచ్ఛత పనులు చేపట్టి మున్సిపల్ కార్పొరేషన్ కార్యకలాపాలకు వినియోగించుకునే విధానాన్ని ఈ నెల 14 నుండి పునః ప్రారంభిస్తామని తెలిపారు. అపరిశుభ్రంగా ఉన్న ఖాళీ స్థలాల యజమానుల చిరునామా వివరాలు లభించకపోవడంతో కొంతమందికి నోటిసులు అందలేదని, దీంతో ప్రజల నుండి వస్తున్న విజ్ఞప్తుల మేరకు ఈ నెల 14న వరకు గడువు ఇస్తున్నట్లు కమిషనర్ పేర్కొన్నారు. అనంతరం నోటిసులు అందినా, అందకపోయినా అపరిశుభ్ర ఖాళీ స్థలాల్లో కార్పొరేషన్ కార్యకలా