అసిఫాబాద్: ఆసిఫాబాద్ జిల్లాకు ఆరెంజ్ అలెర్ట్ జారీ
ఆసిఫాబాద్ జిల్లాలో రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చలి తీవ్రత అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఎముకలు కొరికే చలితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాబోయే మూడు రోజుల పాటు చలి తీవ్రత పెరుగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో ఆసిఫాబాద్ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. దీంతో వృద్ధులు, చిన్నారులు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు