సిర్పూర్ టి: సిర్పూర్ నియోజకవర్గ వ్యాప్తంగా కూలీలు దొరకకపోవడంతో వరి కోసేందుకు యంత్రాలపై ఆధారపడుతున్న రైతులు
సిర్పూర్ నియోజకవర్గ వ్యాప్తంగా కూలీల కొరత ఏర్పడింది. వరి కోసేందుకు కూలీలు దొరకకపోవడంతో హార్వెస్టర్ యంత్రాలపై ఆధారపడవలసి వచ్చిందని రైతులు తెలియజేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా పత్తి, వరి పంటలు ఒకేసారి కోతకు రావడంతో కూలీలు పత్తి తీసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఒక కిలో పత్తి ఏరితే పది రూపాయలు వస్తుండడంతో కూలీలంతా అటువైపు వెళుతున్నారని రైతులు తెలిపారు,