జిల్లాలో ప్రజలనుండి స్వీకరించిన అర్జిలు 97% పరిష్కారం: డీఆర్వో కె. చంద్రశేఖరరావు
Machilipatnam South, Krishna | Sep 22, 2025
జిల్లాలో 97% అర్జీలకు పరిష్కారం: DRO స్తానిక మచిలీపట్నంలో సోమవారం ఉదయం 11 గంటల సమయం నుండి రెండు గంటల సమయం వరకు ప్రజా సమస్యల పరిష్కార వేదికను డీఆర్వో కె. చంద్రశేఖరరావు నిర్వహించారు. ప్రజలు తమ సమస్యలపై వినతిపత్రాలు సమర్పించారు. జిల్లాలో 97 శాతం వినతులు పరిష్కరించామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ధర్నా నిర్వహించిన గ్రామ రెవెన్యూ సేవకులు, విద్యుత్ జేఎల్ఎంలు తమ సమస్యలను డీఆర్వోకు విన్నవించుకున్నారు. DRO సానుకూలంగా స్పందించి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.