గుడిహత్నూరు: కార్మికులకు కనీస వేతనం అందేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి: ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి విలాస్
కార్మికులకు కనీస వేతనం అందేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి విలాస్, జిల్లా కార్యదర్శి దేవేందర్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఆదిలాబాద్ కార్మిక శాఖ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. కార్మికులకు అనుకూలంగా ఉన్న చట్టాలను యధావిధిగా కొనసాగించాలన్నారు. జులై 9న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలన్నారు.