పేద ప్రజలకు అండగా ఉంటామని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు అన్నారు. కళ్యాణదుర్గంలోని ప్రజా వేదికలో శనివారం 43 మంది బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.32.60 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జనవరిలో రెండుసార్లు, ఈరోజు బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశామన్నారు. కూటమి ప్రభుత్వం ఎప్పుడు పేదలకు అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.