మార్కాపురం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని అఖిలపక్ష పార్టీ నాయకులు వినతి పత్రం అందజేశారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని నీరుగారిస్తూ నూతన చట్టాన్ని తీసుకురావడం సరైన పద్ధతి కాదన్నారు. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అఖిలపక్ష పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.