అనంతపురం నగరంలోని టీవీ టవర్ ప్రాంతంలో ఏమిరా అన్నందుకు యువకుడి పై విచక్షణ రహితంగా దాడి
Anantapur Urban, Anantapur | Mar 29, 2026
ద్విచక్ర వాహనంలో వెళ్తున్న యువకుడిని అడ్డుకున్న కొందరు యువకులు మాటలలో భాగంగా ఏమీరా... అన్నందుకు సాయికుమార్ అనే వ్యక్తిపై దినేష్, సాయి, శేషు అనే ముగ్గురు యువకులు విచక్షణారహితంగా రాళ్లతో దాడి చేసి ఆటోలో నుంచి కింద పడేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. తీవ్రంగా గాయపడిన యువకుడిని వారి కుటుంబ సభ్యులు అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.