ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పెడన బొడ్డు నాగయ్య జూనియర్ కళాశాలలో జాబ్ మేళా 49 మందికి ఉద్యోగాలు
Machilipatnam South, Krishna | Sep 20, 2025
పెడనలో జాబ్ మేళా..49 మందికి ఉద్యోగాలు స్తానిక పెడనలోని బొడ్డు నాగయ్య జూనియర్ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఆపీస్ద్క్)ఆధ్వర్యంలో శనివారం మద్యాహ్నం 3 గంటల సమయంలో మెగా జాబ్ మేళా జరిగింది. ఈమేళాకు 11 ప్రైవేటు కంపెనీలు హాజరయ్యాయి. మొత్తం79 మంది నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు హాజరుకాగా, వారిలో 49 మంది వివిధ కంపెనీల్లో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఈ జాబ్ మేళా యువతలో ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ఎంతగానో తోడ్పడుతుందని అధికారులు తెలిపారు.