అద్దంకి నియోజకవర్గానికి చెందిన 65 మందికి ఆదివారం క్యాంపు కార్యాలయం నందు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొని 60 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు, ఐదు మందికి ఎల్ఓసిలు అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక లక్షల మందికి ముఖ్యమంత్రి సహాయనిధి అందుతుందని అన్నారు.