వైరా: సమస్యలను పరిష్కరించాలంటూ సీపీఎం ఆధ్వర్యంలో వైరా మున్సిపాలిటీ కార్యాలయం ముట్టడి
Wyra, Khammam | Mar 12, 2025 వైరా మున్సిపాలిటీ పరిధిలోని సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బుధవారం ఉదయం 11 గంటల నుంచి సీపీఎం ఆధ్వర్యంలో మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట నాయకులు నిరసన చేపట్టారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని తక్షణమే ప్రారంభించాలని, ఇంటి పన్నులను తగ్గించాలని, మున్సిపాలిటీలో ఉన్న సమస్యలకు పరిష్కారం చూపాలని వారు డిమాండ్ చేశారు. సీపీఎం నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వం గృహనిర్మాణ పనులను నిర్లక్ష్యం చేయడం వల్ల పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.