డి.హిరేహాల్ మండలంలో వైసిపి ని వీడి పలువురు బిజెపి లో చేరారు. బుధవారం సాయంత్రం విజయవాడ వలో రాష్ట్ర అధ్యక్షులు మాదవ్, మంత్రి సత్యకుమార్ యాదవ్ ఉపాధ్యక్షులు కాపురామచంద్రారెడ్డిలు కాషాయ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. బిజెపి తీర్థం పుచ్చుకున్న వారిలో ఎంపిపి పవిత్ర, మాజీ కన్వీనర్ వన్నూరస్వామి, జిల్లా మాజీ ఉపాధ్యక్షులు రాళ్ళ తిమ్మారెడ్డి, ఎంపిటిసిలు అనిత, సర్పంచ్ లు పుష్పావతి, శ్రీనివాస్ రెడ్డి, హనుమంతరెడ్డి, రామలక్మి, ముఖ్య నాయకులు సురేష్, గొల్ల నాగరాజు, మెత్తం 42 మంది ఉన్నారు