కాగజ్నగర్: అధ్వానంగా మారిన ముట్టంపేట ప్రధాన రహదారి,ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు
కౌటాల మండలంలోని ముత్తంపేట్ నుండి పార్డి వెళ్లే ప్రధాన రహదారిపై పెద్ద గుంతలు ఏర్పడటంతో ప్రజలు నరక యాతన అనుభవిస్తున్నారు. ప్రతి రోజు రైతులు, సామాన్య ప్రజలు నడుస్తున్నారు. ద్విచక్ర వాహనాల దారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు నామ మాత్రపు తనిఖీలు చేస్తూ చేతులు దులుపు కుంటున్నారు. ఈ నరక యాతన భరించ లేక కంకర లారీలు ఆపి నిరసన తెలిపారు. ఒక గర్భిణి స్త్రీ కి అత్యవసరంలో అంబులెన్స్ కూడా వెళ్లలేని పరిస్థితి ఉందని స్థానికులు ఆరోపించారు..ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రోడ్డుకు మరమత్తులు చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు..