మార్కాపురం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం నందు షాది ఖానా నిర్మాణాన్ని పూర్తి చేయాలని కోరుతూ జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ షేక్ మహబూబావలి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాదిఖాన నిర్మాణం చేపట్టి రెండు దశాబ్దాలకు గడిచిన ఇంతవరకు పూర్తి చేయలేదన్నారు. పట్టణంలో సుమారు 25 వేల మంది ముస్లింలు ఉన్నారని వారికి ఉపయోగపడే విధంగా శాదిఖాన ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పాలని ప్రశ్నించారు