పిచ్చాటూరులో కొలిక్కిరాని టిడిపి మండల కమిటీల ప్రకటన
కొలిక్కిరాని TDP మండల కమిటీల ప్రకటన పిచ్చాటూరులో మంగళవారం జరిగిన సత్యవేడు నియోజకవర్గంలోని ఏడు మండలాల కమిటీల ఏర్పాటు ప్రక్రియ ఓ కొలిక్కి రాలేదు. అన్ని మండలాల జాబితాలు, అందరి అభిప్రాయాలను రాత మూలకంగా పరిశీలకులు తీసుకున్నారు. అధిష్టానం నిర్ణయం మేరకు నాయకులతో మండలంలోని గ్రామాల్లో చర్చించి కమిటీలు ఏర్పాటు చేయనున్నట్టు పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు. నేడు కమిటీలపై ఆశలు పెట్టుకున్నవారికి నిరాశ మిగిలిందన్నారు.