సిర్పూర్ టి: దుమ్ము ధూళితో తీవ్ర ఇబ్బందులు పడుతున్న డబ్బా గ్రామ ప్రజలు
చింతల మానేపల్లి మండలంలోని డబ్బా గ్రామంలో ప్రతిరోజు సాయంత్రం దుమ్ము దూళితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఎస్సీ కాలనీవాసులు వాపోయారు. ప్రతిరోజు సాయంత్రం అడవి నుండి పశువులు ఇంటికి వస్తున్న సమయంలో దుమ్ము లేవడంతో రోగాల బారిన పడుతున్నామని ప్రజలు వాపోయారు. అధికారులు వెంటనే స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేస్తే తమ సమస్య పరిష్కారం అవుతుందని గ్రామస్తులు తెలిపారు,