పార్వతీపురం మన్యం జిల్లా, గుమ్మలక్ష్మీపురం మండలం, తాడికొండ గ్రామంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న కందికొత్తలు పండుగలో ప్రభుత్వ విప్ , కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి శనివారం సాయంత్రం పాల్గొన్నారు. తాడికొండ చుట్టుపక్కల గ్రామాల నుండి పెద్ద ఎత్తున గిరిజనులు పాల్గొన్నారు. గిరిజన సాంప్రదాయానికి ప్రతికగా ఈ కందికొత్తలు పండుగ నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. గిరిజనులతో కలసి సంప్రదాయ దీంసా నృత్యాలు చేశారు.