యాడికి మండలం లక్ష్యం పల్లి గ్రామంలో భార్యాభర్తల గొడవ కారణంగా కుమారుడు మృతి చెందాడు. వివరాల్లోకెళ్తే గత రెండు రోజుల క్రితం దంపతులు రమేష్-మహేశ్వరి మధ్య గొడవ జరిగింది. కోపంతో రమేష్ రాయి తీసుకుని భార్య మహేశ్వరి పైకి విసిరాడు. రాయి మహేశ్వరి చంకలో ఉన్న నాలుగేళ్ల రాహుల్ కు తగిలింది. కర్నూలుకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. ఈ సంఘటనపై సీఐ శ్రీనివాసులు కేసు దర్యాప్తు చేపట్టారు.