గుత్తి మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం నాటికి 145 వీధి కుక్కలను పట్టుకొని అనంతపురం తరలించామని మున్సిపల్ కమిషనర్ జబ్బార్ మియా చెప్పారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం ఆయన మాట్లాడారు. మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 700 పైగా వీధి కుక్కులు ఉన్నట్లు నిర్ధారించామన్నారు. అన్ని వీధి కుక్కలను పట్టుకుని ఇంజక్షన్లు వేయించిన తర్వాత వదిలేస్తామన్నారు. వీధి కుక్కల గురించి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు.