వెల్గటూరు: బైక్ ను డీకొట్టిన ఆర్టీసీ బస్సు. ఇద్దరు యువకుల మృతి.!
జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం పాసిగాం గ్రామ శివారులో బుధవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు.కరీంనగర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు, రోడ్డుపై ఉన్న గేదెను తప్పించ బోయి బైక్ ను ఢీకొట్టింది.దీంతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు మృత్యువాత పడ్డారు. మృతులిద్దరూ మంచిర్యాల జిల్లా లక్షేటిపేట మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన మేడి గణేష్, ముచ్చకుర్తి అనిల్ గా గుర్తించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఇక మృతుల్లో అనిల్ అనే యువకుడు రామగుండం పోలిస్ కమిషనరేట్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు.