సైదాపురం మండల పరిధిలో జరుగుతున్న మైన్ గనుల కార్యకలాపాలపై ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ
Gudur, Tirupati | Nov 18, 2025 సైదాపురం మండల పరిధిలో జరుగుతున్న మైన్ గనుల కార్యకలాపాలపై వెంకటగిరి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కురుగొండ్ల రామకృష్ణతనిఖీలు నిర్వహించారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ప్రజల భద్రత, పర్యావరణ పరిరక్షణ, ప్రభుత్వ నిబంధనల అమలు విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేసారు గనుల యాజమాన్య నిర్వహణ, అనుమతుల పరిస్థితి, భవనాలు–యంత్రాంగాల సేఫ్టీ ప్రమాణాలు, కార్మికుల భద్రత వంటి అంశాలను పరిశీలించారు