కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్ నగర్ డిసిపి కార్యాలయంలో ఈనెల 2 వ తేదీన బాలనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లిఫ్ట్స్ ట్రేడ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో జరిగిన దొంగతనం చేసిన పోలీసులు చేదించారు. ఈ కేసులో ఇద్దరు నిందితులు, అల్విన్ కాలనీకి చెందిన వంశీకృష్ణ అనే బైక్ మెకానిక్, మరియు మట్ట భరత్ రాజీవ్ గాంధీ లను అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 2,27,000 నగదు ఒక గ్లామర్ బైక్ స్వాధీనం చేసుకున్నట్లు బాలనగర్ జోన్ డీసీపీ సురేష్ కుమార్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు.