ఉపాధి హామీ పనుల పూర్తిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్
Anantapur Urban, Anantapur | May 26, 2025
ఉపాధి హామీ కింద చేపడుతున్న పనుల పూర్తిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, పెండింగ్ ని వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం రాత్రి 8 గంటల సమయంలో అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఉపాధి హామీ పథకంపై డ్వామా పిడి, ఎంపీడీవోలు, ఏపీడీలు, ఏపీఎం, ఆయా శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కేటాయించిన పనుల్లో ఎప్పటికప్పుడు పురోగతి చూపించాలన్నారు.