మార్కాపురం: సైనిక కాలనీ ఏర్పాటు చేయాలని కలెక్టరేట్ కార్యాలయంలో జెసి శ్రీనివాసులకు వినతి పత్రం అందజేసిన సొసైటీ నాయకులు
మార్కాపురం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో రిటైర్డ్ ఆర్మీ ఎంప్లాయిస్ హౌసింగ్ బోర్డ్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు చిన్నయ్య ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు కలిసి సైనిక కాలనీ ఏర్పాటు చేయాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా చిన్నయ్య మాట్లాడుతూ సుమారు 700 మంది మాజీ సైనికులతో జై జవాన్ అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆగస్టు నెలలో సైనిక కాలనీ ఏర్పాటు చేయాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ వినతిపత్రం అందజేయడం జరిగిందన్నారు. సొసైటీలో 370 మందికి ప్రభుత్వ జీవో ప్రకారం 175 చదరపు గజాలు కేటాయించి సైనిక కాలనీ ఏర్పాటు చేయాలన్నారు.