అద్దంకి పట్టణంలోని రాజీవ్ నగర్ కాలనీ జంక్షన్ వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తి జారీ కింద పడటంతో అతనికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని అతన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.క్షతగాత్రుడు వడ్లమూడి వెంకటేశ్వరరావుగా స్థానికులు గుర్తించారు.