తాడిపత్రి రూరల్ పరిధిలోని చేనేత కాలనీలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఏ టీ ఎం మిషన్ ను పగలగొట్టి నగదు నెత్తికెళ్లడానికి ప్రయత్నించిన నిందితుడిని సోమవారం తాడిపత్రి రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. దుర్గా నాయుడు అనే వ్యక్తి ఆన్లైన్ గేమ్ లో డబ్బు పోగొట్టుకున్నాడు. డబ్బులు సులభంగా సంపాదించాలనే దురాశతో ఏటీఎం మిషన్ ను పగలగొట్టి నగదు ఎత్తుకెళ్లడానికి ప్రయత్నించాడు. పోలీసుల అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. వివరాలను తాడిపత్రి రూరల్ సీఐ శివగంగాధర్ రెడ్డి విలేకరులకు వివరించారు.