సంగారెడ్డి: దివ్యాంగుల క్రీడలకు 2.90 లక్షలు మంజూరు : సమగ్ర శిక్ష అధికారి వెంకటేశం
డిసెంబర్ 3న దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా దివ్యాంగుల క్రీడల నిర్వహణ కోసం రూ.2.90 లక్షల నిధులు విడుదల చేసినట్లు సమగ్ర శిక్ష అధికారి వెంకటేశం తెలిపారు. ప్రతి మండలానికి ప్రాథమిక విద్యార్థులకు రూ.5,000, ఉన్నత విద్యార్థులకు రూ. 5,000 చొప్పున మొత్తం రూ. 10,000 నిధులు కేటాయించినట్లు చెప్పారు. ఈ నిధులతో డిసెంబర్ 3న దివ్యాంగ విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించాలని ఆదేశించారు.