ఢిల్లీ ఉగ్ర దాడి బాధితులకు రూ.25 లక్షలు ఇవ్వాలి: సీపీఐ
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ దారుణమని దోషులను కఠినంగా శిక్షించాలని సీపీఐ డిమాండ్ చేసింది. గూడూరులో మంగళవారం సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి శశి కుమార్, ఏఐవైఎఫ్ నాయకులు సునీల్ మాట్లాడుతూ.. ఎన్నికలప్పుడే తుపాకుల మోతలు, బాంబు బ్లాస్టింగ్ ఎందుకు జరుగుతున్నాయన్నారు. మృతుల కుటుంబాలకు రూ. 25లక్షలు పరిహారం అందించాలన్నారు.