చెంగిచెర్లలో జరిగిన భారీ దొంగతనం కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఘటనా స్థలాన్ని ఉప్పల్ జోన్ డీసీపీ సురేష్ కుమార్ పరిశీలించారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ చెంగిచెర్లలోని కనకదుర్గ, అనుశక్తి నగర్ కాలనీల్లో ఒకే రాత్రిలో మొత్తం 8 ఇళ్లలో దొంగతనాలు జరిగినట్లు తెలిపారు. ప్రాథమిక విచారణలో సుమారు 30 తులాల బంగారం, 8 కిలోల వెండి, రూ.2 లక్షల నగదును దుండగులు అపహరించినట్లు తేలిందన్నారు. క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తోందని, అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని స్పష్టం చేశారు.