అద్దంకి పట్టణంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో విద్యుత్ ఛార్జీలు తగ్గించాలంటూ శనివారం నిరసన కార్యక్రమం చేపట్టారు. స్థానిక బస్టాండ్ సెంటర్ నుంచి ఎమ్మార్వో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సిపిఐ కార్యదర్శి చంద్రశేఖర్ పాల్గొని మాట్లాడుతూ స్మార్ట్ మీటర్ల వలన ప్రజలు తీవ్రంగా నష్టపోతారని అన్నారు. ఆదానితో ఏర్పాటు చేసుకున్న విద్యుత్ ఒప్పందాలను వెంటనే రద్దు చేసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం ఎమ్మార్వో శ్రీ చరణ్ కు వినతి పత్రం అందజేశారు.