వేములవాడ: కేంద్ర బడ్జెట్లో గిరిజనులకు తీవ్ర అన్యాయం జరిగిందని కోనరావుపేట మండల కేంద్రంలో ఆరోపించిన లంబాడీ ఐక్య వేదిక నాయకులు
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ ఏడాది బడ్జెట్ కేటాయింపుల్లో గతంలో ఎన్నడు లేని విధంగా గిరిజనుల అభివృద్ధి, సంక్షేమానికి తీవ్ర అన్యాయం జరిగిందని లంబాడీల ఐక్యవేదిక రాష్ట్ర ఇన్ఛార్జ్ బానోత్ నరేశ్ నాయక్ ఆదివారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఆరోపించారు. వికసిత్ భారత్ అంటూ ప్రచారాన్ని ఊదరగొట్టిన కేంద్ర ప్రభుత్వం.. గిరిజనులను మరింత పేదరికంలో నెట్టే విధంగా బడ్జెట్ కేటాయింపులున్నాయని విమర్శించారు.