పెనుకొండ సమీపంలో ముందు జరిగిన రోడ్డు ప్రమాదాన్ని చూసి భయపడి ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడి యువకుడికి గాయాలు
Anantapur Urban, Anantapur | Mar 28, 2026
శ్రీ సత్య సాయి పుట్టపర్తి జిల్లాలోని పెనుకొండ నియోజకవర్గం పెనుగొండ సమీపంలో ద్విచక్ర వాహనం ను కారు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి తీవ్ర గాయాల పాలయ్యాడు. దాన్ని గమనించిన యువకుడు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తాపడడంతో పెద్దపల్లి గ్రామానికి చెందిన ఆంజనేయులు అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన తనని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.