అసిఫాబాద్: ఆసిఫాబాద్ డివైడర్ లో పిచ్చి మొక్కలను తొలగించిన మున్సిపల్ కార్మికులు
ASF మున్సిపల్ ఫరిదిలో ప్రధాన రోడ్డు డివైడర్ల మధ్య పిచ్చి మొక్కలు ఏపుగా పెరగడంతో మున్సిపల్ కమిషనర్ గజానంద్ ముందడుగు వేశారు. మంగళవారం ASF పట్టణంలోని ప్రధాన రహదారి డివైడర్ పై పెరిగిన పిచ్చి మొక్కలను కార్మికులు తొలగించారు. గజానంద్ మాట్లాడుతూ.. దుకాణాల నుంచి వెలువడే చెత్తను మున్సిపల్ చెత్త వాహనంలో వేయాలని సూచించారు. రోడ్లపై, ఖాళీ స్థలాల్లో వేయకూడదని తెలియజేశారు. ఏదైనా సమస్య ఉంటే కార్యాలయానికి వచ్చి సంప్రదించాలన్నారు.