అన్నదాత సుఖీభవ -పీఎం కిసాన్ రెండో విడత నిధులు విడుదల సందర్భంగా రెండో విడతగా రూ.7 వేల చొప్పున కదిరి నియోజవర్గంలో 83,566 రైతుల ఖాతాలకు పెట్టుబడి సాయం జమ చేసినట్లు కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట్ ప్రసాద్ బుధవారం తెలియజేశారు. అన్నదాత సుఖీభవ మెగా చెక్కు పంపిణీలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కేవలం 4 నెలల కాలంలోనే రూ. 3,020.25 కోట్ల మేర అన్నదాతలకు ఆర్ధిక ప్రయోజనం ప్రభుత్వం కల్పించుదని తెలిపారు.